సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మానవ వనరుల శాఖ ఆద్వర్యంలో కొనసాగే జాతీయ సాంకేతికత మెరుగు పరచబడిన అభ్యాసన కార్యక్రమం (ఎన్.పి.టి. ఈ .ల్.)లో కొత్త కోర్సులు చేయడంలో భీమవరం డి.ఎన్. ఆర్. ఇంజినీరింగ్ కళాశాల మందంజలో ఉందని జులై నెల 5వ తారీఖున ఐ .ఐ .టి మద్రాస్ లో జరిగే ప్రతిష్టాత్మకమైన లోకల్ చాప్టర్ ఆస్పిరంట్ అవార్డు కి ఎంపికైదని కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోక రాజు నరసిహరాజు నేడు, శుక్రవారం హర్షం ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ.సి.ఈ.విభాగానికి చెందిన అధ్యాపకుడు కె. శేఖరబాబుకు మోటివేటెడ్ లెర్నర్ ,బిలివర్ మరియు టాప్ పెర్ఫార్మింగ్ మెంటార్ స్టార్ అవార్డులు అలాగే ఈ.సి.ఈ. విభాగాధిపతి డాక్టర్ .కె. వేణుగోపాల్ కు బిలివర్ స్టార్ అవార్డు వచ్చిందని, వారిని అభినందించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యవారాయణ రాజు (బాబు) మాట్లాడుతూ.. నూతన కోర్సులు గురించి తెలుసుకుని విద్యార్థులకు బోధించడానికి (ఎన్.పి.టి. ఈ. ల్.) ఎంతో దోహదపండుతుందని అన్నారు. ఈ సమావేశంలో .కళాశాల వైస్ ప్రసిడెంట్ గోకరాజు పాండురంగ రాజు,ప్రిన్సిపాల్ డాక్టర్ ఎమ్. అంజన్ కుమర్ ,కళాశాల కార్య వర్గ సభ్యులు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి.వి .స్. వర్మ తదితరులు పాల్గొన్నారు.
