సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి జేష్ఠ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు, శుక్రవారం దేవాలయం వేలాది భక్తుల సందోహంతో కళకళ లాడింది.శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తురాలు రావూరి కృష్ణ శ్రీ నందిని 8 గ్రాములు బంగారం కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి శేషవస్త్రం,ప్రసాదాలు అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. గత గురువారం స్థానిక మోటుపల్లివారి వీధిలోని శ్రీ మావుళ్ళమ్మవారి పూరి గుడి వద్ద శ్రీ అమ్మవారి జేష్ఠ మాసోత్సవాలు సేవ కార్యక్రమాల్లో భాగంగా డప్పులు మేళతాళాలతో కళాకారులచే గరగల నృత్యం నిర్వహించారు.
