సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసం లో తెలంగాణ వైసిపి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో వై యస్ షర్మిల నేడు, శుక్రవారం సమావేశమయ్యా రు. తనపై ఎవరెన్ని దాడులు చేసినా, కొట్టిన ఆఖరికి చంపిన ఎట్టిపరిస్థితుల్లో తగ్గేదిలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య క్షురాలు వైఎస్ షర్మిల తేల్చిచెప్పా రు. టీఆరెస్ ఎమ్మెల్యేలు, నేతల బెదింపులు, తన పాదయాత్ర కొనసాగింపుపై తెలంగాణలోని వివిధప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఆమె సుదీర్ఘంగా చర్చించారు. ఆగిన చోటు నుంచే పాదయాత్రను కొనసాగిస్తాం . ఇప్పటివరకు 3,525 కి.మీ. మేర పాదయాత్రను పూర్తి చేశాం . 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తామని షర్మి ల ప్రకటించారు. తన పాదయాత్రను తిరిగి ఈ నెల 4 నుంచి మొదలుపెట్టి 14వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సం పేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుం చి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని షర్మిల తెలిపారు. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని.. వారంతా తన కుటుంబమని అన్నారు. ఇకపై పాదయత్రనే కాదు తెలంగాణాలో వైఎస్ఆర్ తెలం గాణ పార్టీని ఆపడం ఎవరి తరం కాదు’’ అని షర్మి ల ప్రకటించారు.
