సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోనేడు, గురువారం యోగా ఆంధ్ర లో భాగంగా ఒకేసారి 6 వేల మందితో యోగాబ్యాసనాలు వెయ్యడం హైలైట్ గా నిలచింది. ఈ భారీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యేలు అంజిబాబు, పితాని సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొనడం విశేషం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో జిల్లా కలెక్టరు నాగరాణి , జిల్లా ఎస్పీ అద్నాన్ ఆధ్వర్యంలో మెగా యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసి రాహుల్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొని యోగాసనాలు వేసారు. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. యోగా భారతదేశ ప్రాచీన సంపదని, భారతదేశం యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. ప్రపంచంలోని 180 దేశాలలో ప్రజలు యోగా సాధన చేస్తుండడం ప్రతి భారతీయుడు గర్వపడాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా సాధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యేలు రఘురామా, అంజిబాబు, పితాని మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, యోగా సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షుతో జీవించగలుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దిన చర్యగా చేసుకోవాలన్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్ష మేరకు ఆంధ్రరాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వెలది విద్యార్థులు. జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *