సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వచ్చంద సంస్థ రాజ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 1లక్ష 50 వేల విలువైన నోటు పుస్తకాలను పేద విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు అన్నిదానాల కెల్లా విద్యాదానం ఎంతో గొప్పది.. అదికూడా .. దాతలు మూడు జిల్లాలోని పేద విద్యార్థులకు లక్ష 50 వేల పుస్తకాలను ఉచితంగా అందించడం గొప్ప విశేషమని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలని, చదువుకునే విద్యార్థులను సమాజం గుర్తుందని, నేడు దాతలకు కొదవలేదని దాతలందిస్తున్న సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. రాజ్ ట్రస్ట్ విద్యకు, వైద్యానికి పేదవారికి పింఛన్లు, మహిళలు ఉచిత కుట్టు మిషన్లు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాజ్ ట్రస్ట్ అధ్యక్షులు గంటా రాజ్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, జనసేన నాయకులు బ్యాంక్ బాబీ, కొప్పినిడి శ్రీనివాస్, రెడ్డి సత్తిబాబు, యర్రంశెట్టి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
