సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి జేష్ఠమాసోత్సవాలు జరుగుతున్నా నేపథ్యంలో నేడు, శనివారం శ్రీ అమ్మవారిని దర్శించుకొన్న హైదరాబాద్ కి చెందిన భక్తురాలు చెరుకుమిల్లి సత్యవాణి దేవాలయంలో భక్తులకు నిత్యం జరిగే అన్నసమారాధన ట్రస్ట్ కు 50,116 ( యాభై వేల నూటపదహారు) రూపాయలు కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనం నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందించడం జరిగింది.
