సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 36వ వార్డులోని రామరాజు తోటలో మావుళ్ళమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు, ఆదివారం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి (చిన మావుళ్ళమ్మ) 40వ జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని మాట్లాడారు. జాతరలు గ్రామశాంతిని కోరుకుంటాయిఅని.. గత 40 ఏళ్లుగా సేవ సమితి సభ్యులు సంప్రదాయబద్ధంగా మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ 5 రోజులపాటు జాతర మహోత్సవాలు జరుగుతాయని, 27న అన్న సమారాధన జరుగుతోందని అన్నారు. అనంతరం డప్పుల వాయిద్యాలు, గరగల నృత్యాలు, శక్తివేశాలతో అమ్మవారి జాతర కన్నుల పండువగా జరిగింది. మావుళ్ళమ్మ సేవా సమితి సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
