సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జులై 5 వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి. ఆరోజు ఎక్కువ కేసులను రాజీ చేయడం సహకరించాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr.B. లక్ష్మి నారాయణ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో కేసుల రాజీకి తీసుకోవలసిన చర్యలపై నేడు సోమవారం న్యాయమూర్తి లక్ష్మి నారాయణ అధ్యక్షతన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతీ పోలీసు స్టేషన్ లో ఎన్ని రాజీపడదగ్గ కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల వరకూ రాజీ అవుతాయి అనే వివరాలను పోలీసు అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) శ్రీమతి M.సుధారాణి, 1వ అదనపు మొదటి తరగతి మేజిస్ట్రేట్ శ్రీమతి P.హనీష, 2వ అదనపు మొదటి తరగతి మేజిస్ట్రేట్ శ్రీమతి N. జ్యోతి, బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగరాజు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ K.సుజాత, భీమవరం వన్ టౌన్, టూటౌన్, రూరల్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, భీమవరం వన్ టౌన్, టూటౌన్, రూరల్, ఎక్సైజ్, ఆకివీడు, ఉండి, కాళ్ళ, వీరవాసరం, పాలకోడేరు సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *