సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్యవాలు ఘనంగా ముగుస్తున్నాయి. ఈ జేష్ఠమాసం ఆఖరి రోజు గాను నేడు, బుధవారం ఆలయంలో శ్రీ అమ్మవారి కి ఉయ్యాల సేవ కార్యక్రమంని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటి వారు , అత్తింటి వారుగా పిలవబడుతున్న స్థానిక అల్లూరి, మెంటే వంశస్తులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు సిబ్బంది ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు.
