సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నేడు, గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మరియు ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మంగం వేణు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం శారీరక, మానసిక, సామాజిక పరంగా వ్యక్తి, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఒకసారి అలవాటు పడ్డట్లయితే అది జీవితాన్ని నాశనం చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సందర్భంగా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ (స్టూడెంట్ అఫైర్స్ & అడ్మినిస్ట్రేషన్) డా. పి. శ్రీనివాస రాజు మాట్లాడుతూ,. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహనను పెంపొందించడంతో పాటు, సమాజానికి హానికరమైన వ్యసనాలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడే ధృడమైన మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలని అన్నారు..ముఖ్య అతిథిగా హాజరైన భీమవరం POCSO చట్టం-2012 ప్రకారం వేగవంతమైన న్యాయ విచారణకుII అదనపు ప్రథమ తరగతి న్యాయ మజిస్ట్రేట్ ఎన్. జ్యోతి, ప్రత్యేక న్యాయమూర్తి మరియు III అదనపు జిల్లా న్యాయమూర్తి (FAC), MLSC చైర్మన్ డా. బి. లక్ష్మీనారాయణ. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం – 1985 (NDPS Act)**లోని ప్రధాన నిబంధనల గురించి వివరించారు. డ్రగ్స్ ఉత్పత్తి, వినియోగం, నిల్వ, పంపిణీ మొదలైన వాటిపై ఈ చట్టం కఠినమైన శిక్షలను విధిస్తుందని, విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు వై. న్యూటన్ భీమవరం గ్రామ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాసరావు , డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే ఎదురయ్యే న్యాయపరమైన చర్యలు మరియు వాటి వల్ల విద్యార్థుల జీవితాలపై వచ్చే ప్రభావాల గురించి వివరించారు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిపాలనా సిబ్బంది, మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *