సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం జెపి రోడ్డులో నేడు, మంగళవారం డాక్టర్స్ డే,చార్టెడ్ అకౌంటెంట్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఎంతో సమర్ధవంతమైన పిల్లల డాక్టర్ గా ప్రఖ్యాత గాంచిన డా ఎం గోపాల కృష్ణంరాజు, డా ఎన్ శంకర్ కుమార్ వర్మ, డా.చుండూరి మల్లీశ్వరి,లయన్ CA కేఎస్ఎన్ రాజులను సత్కరించారు. ఈ సందర్భముగా సత్కార గ్రహీతలు మాట్లాడుతూ.. సమాజంలో అత్యంత పవిత్రమైన కీలకమైన వృత్తి వైద్యమని, ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాంధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారని అన్నారు. మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృథాయేనని, అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యునికే ఉందన్నారు. వైద్యులను ‘వైద్యో నారాయణో హరి’ అంటూ ప్రజలు గౌరవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్, కనగర్ల రామకృష్ణ ఇతర సభ్యులు నడింపల్లి మహేష్, విశ్వనాథరాజు,గోపిశెట్టి మురళి,ఆదిత్య కృష్ణంరాజు తదితరులు పాలుగొన్నారు.
