సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి, ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు… లోకహితం కోసం మన ప్రాంత ప్రజలు అందరికి కష్టాలు తొలగి, అందరూ కలిసి మెలిసి ఉండి.. ఆర్ధిక సమస్యలు నుండి.. బయట పడడానికి.. గొప్ప శక్తి కలిగి, దైవాంశ సంభూతమైన.. మహా సుదర్శన హోమం సంకల్పించి నందున ఈ జులై నెల 4 వ తేది శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శ్రీ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ సుదర్శన యంత్రం సహితంగా దేవస్థానం వేద పారాయణ దారులు ఋగ్వేద, శుక్ల, యజుర్వేద పారాయణదారులుచే నిర్వహించడం జరుగుతుంది. భక్తుల నుండి ఎటువంటి రుసుము లేకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరు పాల్గొని, శ్రీ అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్ధ ప్రసాదాలు పొందాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ కోరారు.
