సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం (05.07.2025)కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మన ‘సిగ్మా న్యూస్’ కు పంపిన తాజా సమాచారం ప్రకారం.. కేంద్ర రైల్వే సఖ తన విజ్ఞప్తితో భీమవరం మీదుగా ఈ జూలై 9వ తేదీ నుండి నర్సాపూర్ – తిరువణ్ణామలై (అరుణాచలం) వీక్లీ స్పెషల్ రైలు ను ప్రారంభించిందని తెలిపారు. ఈ వీక్లీ స్పెషల్ రైలు జూలై 9వ తేదీ నుండి ప్రారంభమై వచ్చే మూడు నెలల పాటు ప్రతి వారం ఈ ప్రత్యేక రైలు నడవనుంది. 07219 నర్సాపూర్ – తిరువణ్ణామలై స్పెషల్ ట్రైన్ ప్రతి బుధవారం నర్సాపూర్ నుండి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 4.55 నిమిషాలకు తిరువణ్ణామలై చేరుతుంది. 07220 తిరువణ్ణామలై – నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ – ప్రతి గురువారం తిరువణ్ణామలై నుండి ఉదయం 11 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ నర్సాపూర్, పాలకొల్లు, భీమవరం, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వేలూరు మీదుగా తిరువణ్ణామలైకి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే మార్గంలో తిరిగి నర్సాపూర్‌కు చేరుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని గోదావరి జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
