సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో 2024-25 విద్య సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 32 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 2,500 చొప్పున శ్రీతుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో నేడు, ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా మెరిట్ స్కాలర్ షిప్స్ ను అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, ఇంటర్ లో ఈ ఏడాది అత్యధిక శాతంలో ఉత్తీర్ణత సాధించారని, గత దశాబ్ద కాలంగా తుమ్మలపల్లి ట్రస్ట్ ద్వారా విద్య ఆర్ధిక ప్రోత్సాహకాలు అందివ్వడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మలపల్లి శివ చెరుకువాడ రంగసాయి, వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణ మూర్తి, భట్టిప్రోలు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
