సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం పాత బస్ స్టాండ్ వద్ద సుమారు 7 ఏళ్ళు క్రితం తొలగించి ఖాళీ స్థలంగా ఉంచిన స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ ను మరల అదే ప్రాంతంలో పునర్మించాలని ఇటీవల అల్లూరి .. మెమోరియల్ హాల్ సాధన కమిటీ వారు ఉద్యమిస్తు, ప్రజా ప్రతినిధులను కలుస్తూ.. కార్యాచరణ చేప్పట్టిన నేపథ్యంలో నేడు, సోమవారం వారు గునుపూడి లోని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మోషేను రాజు మాట్లాడుతూ.. మన ప్రాంత వాసిగా అల్లూరి సీతారామరాజు గారి గౌరవార్ధం భీమవరం పట్టణంలో దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలకు వేదిక అయిన అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునః నిర్మాణానికి తన వంతు కృషి మద్దతు ఉంటుందన్నారు.
