సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మానసిక ఒత్తిడిని దూరంచేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన అని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, సద్గురు షిరిడి సాయి ప్రబోధించినట్లు ప్రతి ఒక్కరూ శ్రద్ద సహనం కలిగి ఉండాలి. భగవంతుడి సేవ చేయాలి శ్రీషిరిడి సాయిబాబా రధ మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరంలో గురు పౌర్ణమి సందర్భంగా 36వ వార్డు బైపాస్ రోడ్డులోని శ్రీషిరిడి సాయిబాబా రధ మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముందుగా బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. బాబావారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. శ్రీషిరిడి సాయిబాబా రధ మందిర ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, అధ్యక్షులు చల్లా రాము మాట్లాడుతూ ఈనెల 17న అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, చింతలపాటి బంగార్రాజు, చెరుకువాడ రంగసాయి,ఎంవి రమణ, యాసా అనిల్, కొప్పర్తి కోటి, యడ్లపల్లి రాంబాబు, మాదాసు బాబీ, కొప్పినిడి బాబీ, మదాసు సాయి, గంటా శివ, మహిళ భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *