సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి తమ ఇంటి ఆడపడుచుగా భావించి పలు కుటుంబాలు ప్రతి ఏటా ఆషాడ మాస సారె ను అందజేసే ఆనవాయితీ నేపథ్యంలో ఆషాడ మాసం సందర్భంగా, నేడు, ఆదివారం స్థానిక రెస్ట్ హౌస్ రోడ్ కి చెందిన మిండీ ఈశ్వరరావు నాగ సుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు 50 రకముల పండ్లు మరియు స్వీట్స్ తో, చీర రవిక, గాజులు పువ్వులు తో శ్రీ అమ్మవారికి సారి సమర్పించారు.వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూజలు ఆశీర్వచనం నిర్వహించారు.ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు శేషవస్త్రం అందించారు.
