సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యాయవాదులు ముందు ‘మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకోండి” తదుపరి తమ వద్దకు న్నాయం కోసం వచ్చే కక్షిదారులకు మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను తెలియజేయాలని” ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) G.సురేష్ బాబు అన్నారు. మధ్యవర్తిత్వం పై భీమవరంలో ఈనెల 10 నుండి 16 వరకూ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం న్యాయమూర్తి G.సురేష్ బాబు అధ్యక్షతన మీడియోషన్ న్యాయవాదులు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మీడియేషన్ న్యాయవాదులు స్టీఫెన్ బాబు, విజయలక్ష్మీ, ప్యానల్ న్యాయవాదులు సురేష్ కుమార్, సుధీర్, అంబేద్కర్, జ్యోతి, భవాని, లోకేష్, రవికిరణ్, పారా లీగల్ వాలంటీర్లు సత్యనారాయణరాజు, నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
