సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దంతులూరి నారాయణరాజు కళాశాల ఆవరణలో నేడు సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం దానిలో 50 మంది రక్తదానం చెయ్యడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) మరియు ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజులు పాల్గొన్నారు. వారు మాట్లాడతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతీ సంవత్సరం తమ కళాశాలలో అనేక పర్యాయాలు రక్తదాన శిభిరాన్ని ఏర్పటు చేస్తున్నామని అన్నారు. తమ కళాశాలలో చదివే విద్యార్ధులకు చదువుతో పాటు సామాజిక భాద్యత ను కూడా తెలిసే కార్యక్రమాలు కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రోజు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు గారి పుట్టిన రోజు అని తేలియజేస్తూ.. అయన ఏలూరులో ఆశ్రం హాస్పటల్ ను ఏర్పాటు చేసి తమ కళాశాలలో విద్యార్ధినీ విద్యారుదలకు మరియు అధ్యాపకులకే కాకుండా చుట్టు ప్రక్కలు గ్రామ ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు సాయం అదిస్తున్నారని, ప్రశంసించారు. రక్త దానం చేసిన విద్యారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
