సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానము,లో నేడు( ది 17-07-2025) గురువారం హుండీలు తెరచి లెక్కించగా గత 114 రోజుల కాలానికి వచ్చిన ఆదాయం భక్తులు హుండీల ద్వారా మొత్తం ఆదాయం రూ.88,69,425./ (అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు,) బంగారం 92 గ్రాములు 500 మిల్లీలు,వెండి 623 గ్రాముల 500 మిల్లీలు మరియు పలు దేశముల విదేశీ కరెన్సి శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు.ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,జిల్లా దేవదాయ ధర్మదాయశాఖ అధికారి V హరిసూర్యప్రకాశ్ , శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానం యనమదుర్రు ఈఓ దండు కృష్ణంరాజు,కొణితివాడ గ్రూప్ టెంపుల్స్ ఈఓ కర్రీ శ్రీనివాస్ మరియు కరూరి వైశ్య బ్యాంకు సిబ్బంది,పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *