సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం శ్రీ కాశీ విశ్వనాథుడిని, కాలభైరవుడిని నరసాపురం ఎంపీ , కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆలయ మర్యాదలతో దర్శించుకొన్నారు. వారణాసికి చేరుకున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు ఆలయ అధికారులు, స్థానిక బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కాలభైరవ స్వామివారికి అనంతరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి చేరుకొని శ్రీ విశ్వనాథుడిని దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఆయన నిర్వహించారు. స్థానిక ఎంపీ, ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వారణాసిలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. కాశీ విశ్వనాథుడి దర్శనం తనకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని, ఆకాంక్షించారు. కేంద్రమంత్రి వర్మ వెంట భీమవరం నుండి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, వేగేశ్న రంగరాజు, వేగేశ్న పవన్ వర్మ, సీనియర్ బిజెపి నాయకులు వేలూరి వేంకట రామయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *