సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కోసం అవసరమైన ఉపకరణాల ఎంపిక మరియు గుర్తింపు శిబిరాన్నికేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 20వ తేదీన పాలకొల్లులో నిర్వహిస్తున్నట్లు దీనికోసం తాను బాధ్యత నిర్వర్తిస్తున్న ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన SAIL నుండి 50 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను ఈ కార్యక్రమం కోసం మంజూరు చేయించడం జరిగిందని, మరో 2లేదా 3వారాలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ ఆదివారం పాలకొల్లు లోని మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ALIMCO సంస్థకు చెందిన ప్రత్యేక వైద్య బృందం పాల్గొని సేవలంది స్తారన్నారు. ఈ శిబిరం ద్వారా దివ్యాంగులకు అందించవలసిన ఉచిత ఉపకరణాలను డాక్టర్ల బృందం గుర్తించడం జరుగుతుందని, త్వరలో అర్హులకు కృత్రిమ అవయవాలు, వాకర్లు (Walkers), ట్రైసైకిల్ , వీల్‌చైర్ , హియరింగ్ ఎయిడ్ , క్రచ్‌లు , కృత్రిమ కాలు , అంధుల కోసం స్టిక్ లు, చెవి వినికిడి పరికరాలు , బ్యాటరీ ట్రైసైకిల్ , రోలేటర్లు , ఎంఎస్ క్రీప్స్ , అందుల కోసం చేతి వాచ్,లు అందుల చేతి కర్రలు, లెప్రసీ బాధితుల వాకింగ్ పరికరాలు , క్రచ్‌లు , ఎం.యస్.డబ్ల్యు.డి క్లిప్స్ , స్పైనల్ చెయిర్స్ తదితర పరికరాలను అందిస్తామన్నారు.
