సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మార్కెట్ యార్డ్ నూతన చైర్మెన్ గా ప్రభుత్వం నియమించిన ఎఎంసి చైర్మన్ కలిదిండి సుజాత, రామచంద్రరాజు దంపతులు( వెంప గ్రామానికి చెందినవారు) నేడు, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అంజిబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే అంజిబాబు వారిని అభినందిస్తూ కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎఎంసి చైర్మన్ సుజాత రామచంద్ర రాజు మాట్లాడుతూ .. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, మార్కెట్ కమిటీని కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు బాధ్యతగా రైతు సంక్షేమం, అభివృద్ధికి మార్కెట్ యార్డ్ ల అన్నదాతలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా కృషి చేస్తానని అన్నారు.కూటమి పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.
