సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రతిష్టక్రమిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా బొండాడ నాగ భూషణం ను నియమించడం జరిగిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అధికారికంగా ప్రకటించారు. నేడు, శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగ భూషణం ను అభినందించి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి సేవా చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నాగ భూషణం మాట్లాడుతూ .. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు కరుణతో, నాపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి నావంతు సర్వదా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
