సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జేపీ రోడ్ లో స్థానిక ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థి మంతెన బాలకృష్ణ వర్మ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నేడు, శనివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు కళాశాలలో పనిచేసిన వాకర్స్ కు అందరికీ సద్వినియోగం అయ్యేలా ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం తరఫున పూర్వ విద్యార్థి బాలకృష్ణ వర్మను సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ సాగి నిషాంత్ వర్మ, ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డా ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డా కె వి మురళీ కృష్ణంరాజు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *