సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు, శనివారం భీమవరంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన బిజెపి జిల్లా పదాధికారుల సమావేశం అనంతరం, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి 21 మందితో కూడిన జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాశీ రాజు మాట్లాడుతూ, బిజెపి సంస్థాగత ప్రక్రియలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలోని 25 మండల కమిటీలకు అధ్యక్షులను ఇటీవల ఎన్నుకోవడం జరిగిందన్నారు. కమిటీలో 33% మహిళా రిజర్వేషన్ కింద ఏడుగురిని చేర్చుకున్నామని, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ సుభాష్ రాజునార్ని తాతాజీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *