సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా విభాగానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేడు, ఆదివారం నుండి కలిదిండి వినోద్ వర్మ నియమితు లయ్యారు. పార్టీ పటిష్టతకు ఆయన చేసిన కృషి, అంకితభావాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం ఈ కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించింది. కేంద్ర మంత్రి , తన మామయ్య భూపతిరాజు శ్రీనివాస వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, 15 సంవత్సరాల క్రితం బీజేపీలో సాధారణ కార్యకర్తగా చేరారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. 2023లో పశ్చిమ గోదావరి జిల్లా BJYM అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, జిల్లాలోయువ మోర్చా బలోపేతం చేయడానికి విశేషంగా కృషి చేశారు.2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస వర్మ తరఫున వినోద్ వర్మ ప్రచార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు, శ్రీనివాస వర్మ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ కొత్త బాధ్యతతో యువకుడు వినోద్ వర్మ జిల్లాలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *