సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పురాణాలలో పేర్కొన్న పంచారామాలలో అత్యంత విశిష్టమైనది. భీమవరం గునుపూడిలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ గా చింతలపాటి బంగార్రాజు నియమితులయ్యారు. నేడు, ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోఎమెల్య అంజిబాబు తనను మర్యాదపూర్వకంగా కలసిన శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ చింతలపాటి బంగార్రాజు ను అభినందించి సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న సోమారామం ను మరింత అభివృద్ధి పరచాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ పని చేయాలని అన్నారు. చైర్మన్ చింతలపాటి బంగార్రాజు మాట్లాడుతూ..శ్రీ స్వామివారి దయతో.. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం బంగార్రాజును అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో శివరాపుపేట వాస్తవ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
