సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కీలక తేదీలు ఇలా ఉన్నాయి: ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులు నేటి గురువారం నుండి తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 వరకు గడువు ఉంటుంది. దాఖలైన నామినేషన్లను మార్చి 6న అధికారులు పరిశీలిస్తారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు మార్చి 9 వరకు అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలింగ్ వరకు అవసరమైతే ఏకగ్రీవం కాని పక్షంలో.. మార్చి 16న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెలువరుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *