సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికారపార్టీ టీఆరెస్ కు చెందిన 4గురు ఎమ్మెల్యేల కొనుగోలు లాబీయింగ్ కేసులో హైకోర్టు నేడు, శనివారం తాజగా కీలకతీర్పు వెల్లడించింది. అయితే నిన్న నిందితులకు ఊరటనిచ్చే విధంగా ఉన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేస్తూ ఈ కేసులో ముగ్గరు నిందితులను రిమాండ్కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
