సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు నేడు, గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సిఐడి చీఫ్ సునీల్ కుమార్, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి లు ఏమని ఆలోచిస్తున్నారన్నది తనకు ముఖ్యం కాదని,. ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారన్నదే తనకు ముఖ్యం అన్నారు. విజ్ఞులైన ప్రజలు కూడా తన వాదనలు ఆలోచించాలని అన్నారు. పాలకులు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోమని చెప్పానని, దానికే తనపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య, మతాల మధ్య విభేదాలు సృష్టించానని తనపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా తన మాటల వల్ల ప్రజలు, మతాల మధ్య ఘర్షణలు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. తక్కువ ధరకు ఇసుక విక్రయించాలని, నాణ్యమైన మద్యం మద్యపాన ప్రియులకు అందుబాటులోకి తేవాలని, దేవుని భూములు అమ్మకానికి పెట్టవద్దని మాత్రమే నాలుగు మంచి మాటలు చెప్పానని దానికే తనపై కక్ష కట్టారని లెక్కేలేనన్నికేసులు పెడుతూంరని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల లో అగ్రగామిగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని ఒక జూనియర్ స్థాయి అధికారి అయిన వాసుదేవరెడ్డిని తీసుకువచ్చి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారన్నారు. కాశీ చైనుల శ్రీనివాస్, బొల్లారం శివకుమార్ అనే అదృశ్య వ్యక్తులు స్థాపించిన అడాన్ డిస్టలరీస్ కు వాసుదేవ రెడ్డి వేల కోట్ల రూపాయల మద్యం కొనుగోళ్ల కు ఆర్డర్ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటని ? ఎంపీ రఘురామా తన సందేహం వ్యక్తం చేసారు.
