సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిడదవోలు లో భారీ బహిరంగ సభలో వైసిపి కాపు నేతల సమక్షంలో సీఎం జగన్ నాలుగో విడతలో వైఎస్సా ర్ కాపునేస్తం నిధులు విడుదల చేసారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. కాపునేస్తం తో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు రూ.75వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం . 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేస్తున్నాం . ఎటువంటి లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోనగదు జమ చేస్తున్నాం. కాపు నేస్తంతో 4లక్షల మంది అక్క చెల్లెమ్మలకు లబ్దిచేకూరింది. 45 ఏళ్ళ వయస్సు నుంచి 60 ఏళ్ల అక్క చెలమ్మలకు అండగా నిలిచాం అన్నారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ సారథి. వైఎస్సా ర్ కాపునేస్తంతో ఏ ఆధారం లేని ఒంటరి మహిళలకు ఎంతో లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేసింది.అని ప్రశంసలు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *