సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ విరామం..సుమారు 4 ఏళ్ళ తరువాత భీమవరంలో ఎంపీ రఘురామా కృష్ణంరాజు తన స్వగృహానికి ఈ నెల 13వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భముగా 4 రోజులు పాటు తన సన్నిహితులతో గడపడానికి వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుండి బయలుదేరి ఈ నెల 13వ తేదీ రాజమండ్రి విమానాశ్రయానికి ఉదయం 8- 30 కు చేరుకొంటారు. అటునుండి రావులపాలెం సిద్ధాంతం మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. వడలి, పెనుగొండ, మార్టేరు, పాలకొల్లు , వీరవాసరం మీదుగా భీమవరం శివారు లోని తన నివాసం కు సాయంత్రం చేరుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి టీడీపీ, జనసేన శ్రేణులు తో పాటు ఎంపీ నిధులు పొందిన గ్రామాల ప్రజలు ఏర్పాట్లు చేసుకొంటున్నారని సమాచారం. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఆయన కుమారుడు భరత్ ఈ నెల 11వ తేదీనే భీమవరం చేరుకొంటారని సమాచారం. ఈ సంక్రాంతి పండుగ తరువాత బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమిలో చేరుతుందని ఎంపీ రఘురామా ఆశాభావం తో ఉన్నారు. అప్పుడు ఆ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం లోక్ సభకు పోటీ చేసే ప్యూహంలో రఘురామా కృష్ణంరాజు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగ కు ఎప్పుడు భీమవరం లో ఉండే ఆయన 4 ఏళ్ళ విరామం తరువాత వస్తుండటంతో .. ఇప్పటికే రాష్ట్రంలో అధికార వైసిపి కి రెబల్ గా మారిన ఎంపీ రఘురామా ఆగమనం ఎన్ని వివాదాలకు దారి తీస్తుందోనని సంశయం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *