సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో నేడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్ అందరికీ నిత్య అవసరంగా మారిపోయిందని, వినియోగం కూడా బాగా పెరిగిపోయిందని అయితే తెలుగుదేశం పార్టీ గతంలో ముందుచూపుతో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే ప్రస్తుతం జగన్ సర్కార్ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మెరుగు పడిందన్నారు. అయితే తెలుగుదేశం నాలుగు ఏళ్ళ హయాంలో ఎప్పుడు విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగు ఏళ్ళ కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని గద్దె రామ్మోహన్ అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు చంద్రబాబు కు పట్టం కడతారని తెలుగుదేశం అధికారంలో వచ్చిన మరుక్షణమే 2014 -19 లో ఉన్న విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తాయన్నారు. జగన్ పాలనలో ఏ సంక్షేమం అందక నలిగిపోయిన మధ్యతరగతి ప్రజలు మద్దతు ఈసారి టీడీపీకే అన్నారు. అలాగే పేదలను ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం సైతం 2019 ముందు ఏ ఏ బ్రాండ్లు ఉన్నాయో వాటినే తీసుకువస్తామని.. అదే రేట్‌కు విక్రయిస్తామని గద్దె రామ్మోహన్ భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *