సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మే 3న జరిగే ఆందోళనలకు సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం తెలిపారు. భీమవరంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో మీడియానుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విశాఖస్టీల్ ప్లాంట్ తెలుగుజాతి ప్రజల యొక్క త్యాగాల ఫలితామన్నారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసం 32 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నాడు వేలాదిమంది రైతులు తమ భూముల్ని కారు చౌకగా విశాఖ ఉక్కు నిర్మాణానికి అందించారన్నారు. నేడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 4లక్షల కోట్లకు పైగా విలువ చేస్తుందన్నారు. ఇంతటి విలువైన, లాభాల్లోఉన్న ప్రభుత్వ రంగ సంస్థని కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం చాలా అన్యాయమన్నారు. 32 మంది ఉద్యమకారుల ,ప్రజల ప్రాణ త్యాగాలు, రైతులవేల ఎకరాల భూమి త్యాగాలు, ఉద్యోగుల, కార్మికుల అకుంఠిత కృషితో లక్షల కోట్లు విలువ చేసే విశాఖ ఉక్కును కేవలం 30, 40వేల కోట్లకే పోస్కో కంపెనీకి, అదానీకి కట్టబెట్టాలని చూడడం అన్యాయమైన విషయమన్నారు. కేంద్రం తక్షణం విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను మానుకోవాలని సూచించారు.. కేంద్రంలోని బీజేపీ నాయకులు రెండునాల్కల ధోరణితో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటుందని విమర్శించారు.
