సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల లబ్దిదారులకు పెన్షన్ల తొలగింపుపై సీఎం జగన్ కు నేడు, బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. దానిలో ఇటీవల రాష్ట్రంలో ఎదో వంకతో 4 లక్షల మందికి పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు? అని పవన్ ప్రశ్నించారు. పెన్షన్లు తొలగించేందుకే అధికారులు నోటీసులిచ్చారని, పెన్షన్ల తొలగింపునకు కారణాలు కూడా సహేతుకంగా లేవని పవన్ తెలిపారు. ఇలా పెంక్షన్ లకు కోతలు పెట్టి వచ్చే ఏడాది రూ.3 వేలు పెన్షన్లు ఇస్తామన్న హామీని ఈ విధంగా అమలు చేస్తారు? అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలని, అంతేకానీ పెన్షన్లు పెంచేందుకు లబ్ధిదారులను తగ్గించొద్దని పవన్ స్పష్టం చేశారు. మీ పాలనలో ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వృద్దులకు పెన్షన్ల తొలగింపు, విద్యార్థుల పీజు రియంబర్స్ మెంట్ లబ్దిదారుల తొలగింపు చేపట్టడం ఏమిటి? ఇలా ఎంతమందిని కరెంట్ బిల్లు, స్థలం ఎక్కువ ఉందని నిబంధనలు చూపిస్తూ నోటీసులు ఇచ్చి తొలగిస్తారు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
