సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలలో భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘ఓజీ’ (OG) మూవీ సెప్టెంబర్ 25న విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మినహా ఎందుకో ఇతర రాష్ట్రాలలో పెద్ద హైప్ రాలేదు. ఈ సినిమా కలెక్షన్స్ ఫై కూడా ఫేక్ అంటూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. మేకర్స్ 300 కోట్లు కలెక్షన్స్ సాధించిందని ప్రకటించినప్పటికీ చాల ప్రాంతాలలో నష్టాలు లో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని పలువురు ఆధారాలు చూపిస్తున్నారు. ఏది ఏమైనా సినిమా కు వచ్చిన మంచి టాక్ ను, ట్రైలర్స్, బిజియం అదరగొట్టిన సరే సినిమా అనుకున్నంత క్యాష్ చేసుకోలేకపోయింది. అధిక టికెట్ ధరలు రిపీట్ ఆడియన్స్ ను సినిమా కు దూరం చేసింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ OG సొంతం.. ఇప్పుడీ సినిమాను నెల రోజులు తిరగకుండానే నెట్ ఫ్లిక్స్ లో దీపావళి కానుకగా ఈ నెల 23న ఐదు భారతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ఇప్పుడైనా ఈ సినిమాకు ఇతర భాషల్లో ఆదరణ లభిస్తుందేమో చూడాలి.
