సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్టంలో టీడీపీ, బీజేపీ పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో సూటిగా ప్రశ్నించారు. నేడు, శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబుతో కలిసి ప్రభుత్వ భాగస్వామిగా రాష్ట్రంలో, విజయవాడలో ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని వెల్లంపల్లి విమర్శించారు. ఆ కూల్చిన దేవాలయాలను తిరిగి నిర్మించిన ఘనత సీఎం జగన్ దే నని.. మతం పేరుతొ ఆయనను విమర్శించే అర్హత మీకు లేదని ధ్వజం ఎత్తారు.. రాష్ట్రంలో ఓట్ల రాజకీయాల కోసం మతాలను రెచ్చగొట్టే పనులు బీజేపీ, టీడీపీలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దేశ భక్తుడా? తెలుగుదేశం భక్తుడా? కార్పొరేటర్‌గా కూడా ఎన్నికలలో పోటీకి పనికిరాని వ్యక్తి అని విమర్శించారు.. బీజేపీ వాళ్ళు రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.సోము వీర్రాజు, సీఎం రమేష్, సుజనా చౌదరిలు రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని అన్నారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడుపోయారని విమర్శించారు. . చంద్రబాబు 40 దేవాలయాలు కూలిస్తే సోము వీర్రాజు ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీపై మత, కుల ముద్ర వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
