సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ మండు వేసవిలో గత 2వారాలుగా ఏపీలో విభిన్న వాతావరణం కనపడుతుంది. కొన్ని ప్రాంతాలలో భారీ వడగాల్పులు.. ఒక్కసారిగా వాతావరనమ్ మారిపోయి పిడుగులతో భారీ వర్షాలు.. ఏపీలో రాగల రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర-దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, బుధవారం అంటే ఈనెల 30, మే 1వ తేదీల్లో తేలికపాటి నుంచి కోస్తా ఆంధ్ర తీరప్రాంతాలలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులుతో ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి.
