సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్:ఈసారి కూడా తెలుగు సినీ పరిశ్రమలో వచ్చే సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ సందడి మాములుగా లేదు. అయితే ఈసారి అందరు కామిడి టచ్ ఉన్న సినిమాలతోనే పోటీ పడటం మరో విశేషం.. మొదటగా జనవరి 8వ తేదీన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్,రిలీజ్ అవుతుండగా, జనవరి 12న విక్టరీ వెంకటేష్ ప్రత్యేక ప్రాత్రలో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, మరియుజనవరి 13న రవితేజ ..భర్త మహాశయులకు విజ్ణప్తి,జనవరి 14న నవీన్ పోలిశెట్టి.. అనగనగా ఒక రాజు, శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారి రిలీజ్ కాబోతున్నాయి. అయితే సంక్రాంతి సినిమాలంటే టికెట్ రేట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. తెలంగాణలో హైకోర్టు ఆదేశాలతో టికెట్స్ రేట్లు పెరిగే అవకాశం లేవు కానీ ఈ సారి ఏపీలో మాత్రం సంక్రాంతికి ప్రేక్షకులకు టికెట్స్ రేట్లు చుక్కలు కనిపిస్తాయి. అయితే చిరు- వెంకీ మల్టీస్టార్ సినిమా మాత్రం టికెట్ రేట్లు 100-150 మాత్రమే అదనంగా పెంచేలా ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. గతంలో సంక్రాంతికి వస్తున్నాము కు పెద్దగా(60- 100) టికెట్స్ ధరలు పెంచకుండానే, ఎక్కువ మంది చూడటంతో 300 కోట్లు పైగా లాగేసారు. అదే పార్ములాతో శివశంకర్ వరప్రసాద్ ను ప్రేక్షకుల దగ్గరకు చేర్చే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నారు. ఇదే పార్ములా రాజా సాబ్ కూడా పాలో అయితే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *