సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి,నెల రోజులు పాటు జరిగే వార్షిక మహోత్సవముల సందర్భంగా శ్రీ అమ్మవారి గర్భాలయంలో.. శుద్ధి కార్యక్రమాలు.. అమ్మవారి అలంకరణ పనుల నిమిత్తం.. శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనాలను నేటి బుధవారం డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 28 వరకు నిలుపుదల చేసే క్రమంలో భాగముగా దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి, వేద మంత్రోశ్చరణలు.. విశేష హోమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటల.. సమయంలో దర్శనాలు నిలుపుదలచేసారు తిరిగి ఈ నెల 29 సోమవారం ఉదయం 10.30 గంటలకు కళాన్యాసము జరిపి అమ్మవారి మూలవిరాట్ పునఃదర్శనం జరుగునని మరియు శ్రీ అమ్మవారి ప్రదక్షణ మండపంలో గర్భాలయం వెనుక పూజలు యధావిధిగా జరుగునని భక్తులు గమనించాలని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ విజ్ఞప్తి చేసారు.
