సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ . బోయపాటి శ్రీనివాస్ హ్యాట్రిక్ సూపర్ హిట్ సినిమాల తరువాత భారీ అంచనాలతో వచ్చిన’ అఖండ 2 తాండవం సినిమా అభిమానుల అంచనాలను అందుకున్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించక పోవడంతో కలెక్షన్స్ నెమ్మదించాయి. అయితే మంచి ఓపెనింగ్ కలెక్షన్ వల్ల భీమవరం లో మొదటి వారం 48 లక్షల రూపాయలు టౌన్ గ్రాస్ సాధించి ఈరోజు సోమవారంతో అర్ధ కోటి కలెక్షన్ పూర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి వరకు అందని ద్రాక్షపండులా ఉన్న బాలయ్యకు ఈసారి కోటి రూపాయలు కలెక్షన్ ఈసారి అఖండ 2 తో ఖాయం అనుకున్నప్పటికీ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలలో భీమవరం లో డాకు మహారాజ్ సినిమా 80 లక్షల పైగా వసూళ్లు సాధించడం గమనార్హం..
