సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం మునిసిపల్ కార్యాలయం దగ్గర పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గోలగాని రమేష్ సౌజన్యంతో తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని నేడు, శనివారం ఉదయం ఏపీ విద్యుత్ శాఖ మరియు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ పిఏసి చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుఏపీఐఐసీ చైర్మన్ జిల్లా టిడిపి అధ్యక్షుడుమంతెన రామరాజు,టిడిపి రాష్ట్ర కోశాధికారిమెంటే పార్థసారథిఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. తెలుగుప్రజలఆరాధ్యదైవం అన్న ఎన్టీఆర్ అని తెలుగురాష్ట్రాల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు రాజకీయ పదవులు లభించేలా పరిపాలన చేశారని అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గొలగాని రమేష్ ను అభినందించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలో తీసుకువచ్చిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. .జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ తెలుగురాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకంచేస్తూ నేషనల్ ఫ్రంట్ నెలకొల్పి కాంగ్రెస్ పార్టీని గద్దె దింపిన అన్న ఎన్టీఆర్ అడుగుజాడలలో మనమంతా నడుచుకోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు స్థానిక 6 వార్డు బొక్కవారిపాలెంలోఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం కు చెందిన టీడీపీ కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
