సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్:కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని, గ్రామాలభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. వీరవాసరం మండలం అండలూరు గ్రామం నుంచి పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం వరకు సుమారు రూ 2 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు పనులకు నేడు, సోమవారం వారు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నారని, పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. అన్ని గ్రామంలోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ పాలన అందిస్తున్నామని అన్నారు. అనంతరం అండలూరు గ్రామంలో ఎంపీ నిధులు రూ 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్, చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామస్తులు, పాల్గొన్నారు.
