సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల క్రితం వరకు రిటైల్ కిలో 50 నుండి 60 రూపాయలు పలికిన టమాటా మరోసారి టమోటా ధరలు దారుణంగా పతనం కావడంతో మదనపల్లి, కర్నూలు జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగి పోయింది. రైతులకు కిలో 3 రూపాయలు నుండి 5 రూపాయలు రావడం కష్టంగా మారింది. రిటైల్ మార్కెట్లో టమాటా కిలో 15 రూ. కు ప్రస్తుతం అందుబాటులో ఉంది. మరింత తగ్గే అవకాసమ్ ఉంది. ఇక టమాటా పంటకు ప్రాచుర్యము పొందిన మదనపల్లి పత్తికొండ, ఆలూరు, ఆదోని, డోన్ తదితర ప్రాంతాల్లో పంట కొయ్యడానికి కూలీలు, ఎరువులు, ఎగుమతులకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, కనీసం కిలోకు రూ. 15 ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది అని వాపోతున్నారు. పంటను అలానే పశువులకు వదిలివేస్తునారు. కొందరు కోసిన పంటను మార్కెట్‌కు తరలించిన, రవాణా ఖర్చులు కూడా రావని రోడ్లపైనే పారబోస్తున్నారు. గతంలో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ కిలోకు కనీసం రూ. 8 తగ్గకుండా వ్యాపారులు కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ ఆదేశాలు అమలు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. టమోటా ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు.
