సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఇక శాసన మండలిలో చైర్మెన్ కొయ్య మోషేను రాజు అడ్జక్షతన అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎకరా వచ్చి ’99 పైసలకు’ సంస్థలకు లాలూచి పడి ఇచ్చేయడం ఏమిటని? మీ బంధు వర్గానికి చెందిన ‘గీతం’ కు ఎందుకు వేల కోట్ల భూములు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెడుతున్నారని మంత్రి లోకేష్ ను వైసీపీ సభ్యులు వరుడు కళ్యాణి తదితర సభ్యులు ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టారు. ఆ భూములు ఐటి కంపెనీ లకు ఇచ్చి, ప్రస్తుతం 80 వేల మందికి భవిషత్తులో 5 లక్షల నిరుద్యగులకు ఉపాధి కలిపించడం కోసమే నని మంత్రి‘లోకేష్’ సమర్ధించుకొన్నారు. నిజానికి విశాఖ అభివృద్ధికి జగన్ హయంలోనే విశాఖలో ఐటి కంపెనీలు , అదానీ డేటా సెంటర్స్ వచ్చాయని వాటిని మీరు కొనసాగిస్తున్నారని దీని పేరుతొ వేలకోట్ల భూములు కబ్జా ఏమిటని ప్రశ్నించారు. మంత్రి పార్థసారథి, నుద్దేసించి విద్యార్థులకు పీజు రియంబర్స్ మెంట్స్ ఎందుకు సక్రమంగా చెల్లించడంలేదని, కొన్ని విద్యాసంస్థలకు ఒక్కక్కరికి కేవలం 8 వేలు మాత్రమే చెల్లించి ఊరుకోవడం నిజామా కదా? చెప్పాలని ప్రశ్నించడంతో మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇరువురు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో శాసన మండలి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
