సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ అండ్ ఫార్మా మాఫియా ను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని సీపీఐ రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు నేడు, శనివారం తణుకు నరేంద్ర సెంటర్ లో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శిభీమారావు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కార్పోరేట్,ప్రైవేట్ హాస్పిటల్స్ లో దోపిడీ తీవ్రంగా వుందన్నారు. ఈ హాస్పటల్స్ పై అధికారులు దాడులు నిర్వహించి అధిక బిల్లుల వసూలు నియంత్రించాలన్నారు. ఫార్మా కంపెనీలు ధనార్జనే లక్ష్యంగా నకిలీ,చవక బారు మందులు తయారీతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరంతర తనిఖీలు నిర్వహించి మెడికల్, ఫార్మా మాఫియాపై ఉక్కుపాదం మోపాలని భీమారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, నామాన వెంకటేశ్వరరావు, బొద్దాని కృష్ణ కిషోర్, పెదపోలు వెంకట్రావు,సీపీఐ నాయకులు డివిఎన్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
