సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవలఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ భవానీపురంలో అపార్ట్మెంట్స్ సమీపంలో ఉన్న 42 ఇళ్ళు తొలగింపు నేపథ్యంలో .. జోజి నగర్లో బాధిత కుటుంబాలను నేడు, మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్ ,పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ..కూటమి ప్రభుత్వం ‘25 ఏళ్లు గా నివాసం ఉంటున్న 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డు న పడేసిందని, న్యాయస్థానంలో వారికీ ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వి నియోగంతో దారుణంగా పోక్రెయినలతో క్షణాలలో వారి ఇళ్ళు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 42 కుటుంబాలకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా బుల్డోజర్లతో మధ్య తరగతి కుటుంబాల ఇళ్లను ధ్వంసం చేశారు. వాటిపై బ్యాంకు లోనులు ఉన్నాయి. వాటిని ఎవరు తీరుస్తారు? సుప్రీంకోర్టు లో ఈ నెల 31వ తేదీ వరకు వీళ్లకు ఊరట ఇచ్చింది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం తోనే పోలీసులు ప్రై వేట్ పార్టీకి మద్దతు గా ఈ కూల్చి వేతలు జరిపారు. ఇక్కడ 2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ .150 కోట్ల దాకా ఉంటుంది. అదే ఇక్కడి సామాన్య కుటుంబాలకు శాపం అయ్యింది. 2016లో ‘ఫేక్’ సొసైటీ క్రియేట్ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు, కూల్చి వేతల్లో విజయవాడ MP కెశినేని చిన్ని, జనసేన కార్పేటర్ సోదరుడి పాత్ర కూడా ఉంది. బాధితులు సీఎం చంద్రబాబును మూడు సార్లు, లోకేష్ ను 2సార్లు కలసి వినతి పత్రాలు ఇచ్చారు. అయినా..’ఈ ఇళ్ల కూల్చి వేతలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
