సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అవసరమైన వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గం ఇంచార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. నేడు, గురువారం భీమవరం టీడీపీ కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు రూ 14,61,098 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం అందించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్సకోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గంటా త్రిమూర్తులు .కలిదిండి సుజాత, ఇందుకూరి రామలింగరాజు,కోళ్ల నాగబాబు , మాదాసు కనకదుర్గ . మద్దుల రాము, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారామ్, ఉప్పులూరి చంద్రశేఖర్, షబీనా బేగం, గొలగాని రమేష్, మాజీ కౌన్సిలర్లు ఎద్దు ఏసుపాదం చల్లబోయిన సుబ్బారావు గొంతేన రమణ శ్రీనివాస్ తదితరులు, మరియు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *