సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఎస్ర్కో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్ కు పిఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోరుతూ ఎఐటియుసి విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు,బుధవారం భీమవరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కి అందజేశారు. కాంట్రాక్టర్లు పై చర్యలు తీసుకోవాలని నర్సాపురం, తాడేపల్లిగూడెం డివిజన్లలో విద్యుత్ మీటర్ రీడర్లను కాంట్రాక్టర్లు నిబంధనలు మేరకు జీత భత్యాలు ఇవ్వడంలేదని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ భీమవరం డివిజన్ అధ్యక్షుడు పెనుమాక జాకబ్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పేరుతో రాష్ట్రంలో 4,500 కుటుంబాలను రోడ్డున పడేయొద్దని తమకు న్యాయం చేయాలని కోరారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *